శ్రమ వీరి ఆయుధం , శ్రమించడం వీరి నైజం, శ్రమతో కొండలు పిండి చేయడం వీరికే సాధ్యం, నిండు వేసవిలో మండుటెండను కురిపించే భానుని ప్రతాపం సైతం వీరి శ్రమ ముందు దాసోహమే. వీరే, నాడు వడియరాజులుగా పలుప్రాంతాలను పరిపాలించి , నేడు శ్రమ శక్తి ని సైతం దాసోహం చేసుకున్న నేటి వడ్డెరలు.