కుల దైవం

మన కుల దైవం అంకమ్మ తల్లి :

12వ శతాబ్దంలో నెల్లూరు ప్రాంతము నుండి నాలుగు కుటుంబాలు ఎటువంటి ఆధారము లేకుండా కడప ప్రాంతము వలసవచ్చారు. అక్కడ స్థిర నివాసము ఉన్నటువంటి అంకమ్మ అనే పుణ్యవతిని వీరు సహాయము కోరారు. మీరు ఎవరు ఎక్కడినుండీ వచ్చారు అని అడుగగా, తల్లీ మేము నెల్లూరు ప్రాంతమునుండి వచ్చాము, మేము వడియలము వస్తున్న దారిలో కొందరు దొంగలు మమ్ములని దోచుకొని పోవడము వలన ప్రస్తుతానికి కట్టుకోవడానికి బట్టలు తప్పా ఏమియు లేవు అని చెప్పారు. వారి పరిస్తితిని గమనించిన అంకమ్మ తల్లి వీరికి ఉండటానికి ఒక ఇల్లు మరియు మరలా వీరు వ్యాపారములు చేసుకోవడానికి ధన సహాయమూ చేసినది. ఆ అంకమ్మతల్లి చేసిన మేలు వల్ల ఆ నాలుగు కుటుంబాలు దినదినాభివ్రుది సాధించాయి.
ఆ అంకమ్మతల్లి చేసిన మేలుని మరచిపోకుండా వారు మరియు వారి తరువాత తరాలు కూడా తమ కులదేవతగా మరియు వారి కుల సంరక్షకురాలిగా భావిస్తున్నారు. అంతే కాకుండా తాము రాజవంశమునకు చెందినవారము అని మన పూర్వికులు వాల్కేతమహరాజు గారు అని తమ పిల్లలకు చెబుతూ ఉన్నారు అని మా తాతగారు అయిన గుంజీ నరసింహులు గారు చెప్పేవారు. మా తాతగారు అయిన స్వర్గీయ గుంజీ నరసింహులు గారు ప్రకాశం జిల్లా లోని కందుకూరు మరియు శింగరాయకొండ మండలాల్లో అనేక దేవాలయాలపై శిల్పాలు చేక్కియున్నారు.

ఆ నాలుగు కుటుంబాలు ఎక్కడవి?


వాల్కేతవ మహారాజుగారు చోళ రాజు. మనం గనుక నెల్లూరు చోళరాజుల చరిత్ర చూసినట్లు అయితే రెండవ కరికాళ చోళుడు మొదటి వాడు. అతని తరువాత వంశ వృక్షము ను మనము గమనించినట్లయితే ఈయన కుమారుడు మధురాంతక పొత్తపి చోళుడు. ఈయన కుమారుడు తెలుంగువ విద్యన ఈయన కుమారుడు దాయ భీమ. దాయ భీమాకు ఇద్దరు కుమారులు మొదటివాడు బేత భూప రెండవవాడు సిద్ధ చోళ. బెతభూప అనంతరము ఈయన కుమారులలో ఒకడైన ఎర్రసిద్ద సింహాసనము అధిష్టించాడు. యెర్ర సిద్ధ కు నలుగురు కుమారులు. ఎర్రసిద్ధ అనంతరము మన్మ సిద్ధ రాజ్యాధికారము వహించాడు. మన్మసిద్ద తరువాత చోదతిక్క తరువాత ఆయన కుమారుడు మనుమసిద్ధ పరిపాలించారు. రెండవ మనుమసిద్ధ 1249 నుండి 1270 వరకూ రాజ్యపాలన చేసినట్లు శాశానాలు లభించాయి. మనుమసిద్ధి ముగ్గురు కుమారులలో ఒకడైన నల్లసిద్ద 1270 నుండి 1275 వరకూ రాజ్యపాలన చేసారు. యాదవ రాజు అయిన కటమరాజుకు ఈయనకూ మధ్య ఘోరయుద్ధము జరిగినది. ఈ యుద్ధములో విజయము సాధించినప్పటికీ రాజ్యము చాలా దీనావస్తలో పడినది. రాజకియముగా అనేక మార్పులు సంభవించాయి. నల్ల సిద్ధికి 5గురు కుమారులు. వీరిలో ఒకడైన మనుమగండ గోపాల 1297 వరకూ ఈయన పరిపాలన కొనసాగింది. తరువాత నేల్లూరు చోళ రాజుల వంశము గాని మిగిలిన నలుగురు కొడుకుల వివరాలు గానీ పూర్తిగా లేవు. మా తాత గారు చెప్పిన విషయాలను బట్టి ఆ నాలుగు రాజ కుటుంబాలు అంకమ్మతల్లిని ఆశ్రయించిన వారూ ఒకటే అని నిర్ధారణకు రావడం జరిగింది.

మన కుల దైవం అంకమ్మ తల్లి :


కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి చోళ రాజులు అంకమ్మ దేవతని తమ కుల దైవంగా పూజించినట్లు తెలుస్తుంది. చోళులే కాకుండా ముత్తరాశివారు కూడా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు..
ఆంధ్రప్రదేశ్ చరిత్రని చూసినట్లైతే రాజ రాజ నరేద్ర చోళుని కూతురి పేరు అమ్మంగదేవి (అంకమ్మ దేవి). అంకమ్మ దేవాలయాలు చోళ మరియు విజయనగర రాజులు చేత అనేక ప్రాంతాలలో నిర్మించబడ్డాయి. విరు మాత్రమే కాక అనేక యోధుల కుటుంబాలు కూడా పూజిస్తున్నాయి
ప్రాంతాలు మరియు భాషలను బట్టి అంకమ్మ పేరును ఈ క్రింది విధంగా కూడా పలుకుతారు.
అంగమ్మ దేవి , అమ్మంగ దేవి , మరియు అంకమ్మ దేవత. ఈ దేవతనే అంకలమ్మ, అంకాళి,అంగాళీ, అంకాళ పరమేశ్వరి, మరియు అంగాళ పరమేశ్వరి అని కూడా పిలుస్తారు.
అంకమ్మ దేవరకి చాలావరకూ గుడి (దేవాలయం) ఉండదు. సాధారణంగా ఊరి చివరన చెట్ల పొదలలో ఒక శీలను ఉంచి దానిని అంకమ్మ తల్లి గా భావించి పూజలు చేస్తారు. అంతే కాకుండా ప్రతి సవత్సరం అంకమ్మ కొలుపులు (జాతరలు ) నిర్వహిస్తూ ఉంటారు.
అంకమ్మ కొలుపులు:

No comments:

Post a Comment