వడియరాజుల చరిత్ర


వడియరాజులు వోధ్ర దేశం (ప్రస్తుత వడిసా) నుండి వలస వచ్చి కాలక్రమేణా వడ్డెరలుగా రూపాంతం చెందారు. కర్నాటక ప్రాంతంలోని బోయర్లుగా పిలువబడిన కొందరు ఆంధ్రప్రదేశ్ కు వలసవచ్చి వడియరాజులతో సాన్నిహిత్యం పెంచుకొని, కాలానుగుణంగా వీరిద్దరి కలయిక వడియరులుగా మారి కాలక్రమేణా వాడుకభాషలో వడ్డెరలుగా పిలవబడ్డారు. 12 వ శతాబ్దంలోని పరిపాలించిన చోళరాజులు వడియరాజులుగా చరిత్రకారులు చెపుతున్నారు. చోళరాజులలో అత్యంత ప్రముఖులు రాజరాజనరేంద్రుడు, ఈయన కాలంలో వీరిపాలన ఎంతో ద్విగుణికృతమైనదని చరిత్ర ద్వారా మనకు తెలిసిందే. కర్ణాటక ప్రాంతం నుండి వచ్చిన బోయర్లు మహారాజుల పాలనలో రక్షణ సిబ్బందిలో వుండి రాజ్యాంగ రక్షణతో మమేక్యమైయ్యారు. అలాగే వడియరాజులుగా పిలవబడి పరిపాలకులుగా వుండి ప్రజలకు మంచి పాలన అందించి ఎంతో మంచి పేరుతేచుకున్నారు. నెల్లూరు సీమను పరిపాలించిన రాజులు (రెండవ కరికాల చోలుడి నుండి నల్లసిధ్ది వరకు) సైతం వడియరాజులేనని చరిత్రకారులు చెపుతున్నారు. వీరి వీరిపాలనసమయం లో ప్రజలకు సుపరిపాలన అందించి అభివృద్దికి బాటలు వేసారు. చారిత్రిక కట్టడాలు, పలు దేవాలయాలు నిర్మించి అందరికి ఆదర్శంగా నిలిచారు. రాచరికం అంతరించిన అనంతరం వీరు అటుపిమ్మట వచ్చిన రాజులకు పటిష్టమైన రక్షణవ్యవస్తలో కీలకభాగాస్వాములైనారు. అంతేకాకుండా వీరు కోటలు నిర్మించడంలోను, కందకాలు నిర్మించడంలోను అందెవేసిన చెయ్యి అవడంతో అప్పట్లో కోటలు కట్టడంలో వీరినే ఎక్కువగా ఉపయోగించుకొనేవారు. ఎంతో వైసిష్ట్యంగల వడియరాజుల కాలం అంతరించిన అనంతరం కాలక్రమేణా నిలువ నీడలేని స్థితికి చేరుకున్నారు. అత్యంత బలిష్టులుగా ఎలాంటి పనినైన సునాయాసంగా నిర్వహించగలిగేవీరు అత్యంత కష్టమైన పనులకు చేరువయ్యారు. అత్యంత ప్రమాదకరమైన కొండలను సైతం పిండి చేయగల ధైర్యసాహసాలు, తెగువ వున్న వీరు కొండరాళ్ళను పగులగొట్టి కంకరరాళ్ళుగా మలచడంలో వీరి నైపుణ్యం గొప్పది. మట్టి పనికిగాని, కాలువల నిర్మాణమునకు గాని, వీరు లేనిదే అడుగు కూడా ముందుకు కదలలేని స్తితిలోవుందంటే వారి ప్రాముఖ్యత ఎంతవుందో ఇట్టే అర్ధమైపోతుంది.

ఇంటి పేర్లు మరియు వరసలు

వడియరాజుల ఇంటి పేర్లు ..

ఆలకుంట , అక్తారి, అరుసు, అల్లెపు, ఆర్థి, ఆదేళ్ళ, ఆచి, బత్తినేని, బమ్మిశెట్టి, బత్తుల, భోవి (కర్ణాటలో), బండారు, బత్తుల, బండలవారు , బొంత, బోయి, బసవరాజు, బెల్బాయ్,  బెల్లంకొండ, బోదసు, చిన్నూల్లి, చింతల, చల్లా, చెంబిళ్ళ,  చంద్రగిరి, ఛేంబల్వా , చిట్యాల, దండిగలోరు, దండుగుల, దాసర్ల, దేరంగుల, దేవళ్ళ, ధర్మవరం, దర్గా, గిరి, గుంజి, గుంజ, గుంజల, గంగరాజు , గోగుల, గడిమూత, గంగి, గండికోట, ఇడిగుట్ల, జేరిపాటి, జరంగిలి, జడిపూల, జెమ్మిచెట్టి, జతవ, జనుముల, కాశీ, కుంచపు, కుంచాల, కొనవెల్లి, కొమెర్ల, కనగుల, ఖత్రియ, మల్లెల, మొగలిపువ్వు, మోయిండ్ల, ముదాగుల, మూగచెట్ల, మల్లిశెట్టి, మక్కళ్ళ, మరిముంతల, నాగ, నల్లబొయిన,నల్లపోతుల, ఒర్సు, పల్లపు, పిగిలి, పాలకుండ, పలనాటి, పాలవల్లి, పీట్ల, పసుపుల, రూపాణి, రేణి, సిరిమల్లె, శివనందల, సన్నగజ్జెల, శతరాల, సంపంగి, సిగ్ని, శ్రీరాములు, సంద్ర, సూరోళ్ళు, సల్లగోతి, శివరాత్రి, తన్నీరు, తమ్మిశెట్టి, తుపాకుల, తులసి, తంబళ్ల, తంగేడు, ఉప్పుతోళ్ళ, ఉప్పిట్టి, వేపనీడు, వేపకాయ, వేముల, వల్లెపు, వల్లెపోరు,

1 comment:

  1. wr is our initials wr r belongs to vaddeyarajulu n we r from kolleru in andhrapradesh our initials SAIDU,GANTASALA,BALE,MORU,MUNGARA,JALLURI,PANTHULA,JAYAMANGALA,GURADASU ....... etc

    ReplyDelete