About US

Welcome to Vadiyarajulu.com


ఆదునిక సమాజంలో ఎంత అందమైన భవనమును నిర్మించాలన్నా వడ్డెరల ప్రాదాన్యంలేనిదే లేస్యమైనా నిర్మాణము జరుగదు. ఆధునిక యంత్రాలు కొరవడిన నాటిరోజులలో కిలోమీటర్లు కొద్ది కాలువలు తవ్వటంలోను, కొండలను పిండిచేసి కంకర రాళ్ళను మలచాటంలోను, వీరికి వీరే సాటి. వడియరాజులు వోధ్ర దేశం (ప్రస్తుత వడిసా) నుండి వలస వచ్చి కాలక్రమేణా వడ్డెరలుగా రూపాంతం చెందారు. కర్నాటక ప్రాంతంలోని బోయర్లుగా పిలువబడిన కొందరు ఆంధ్రప్రదేశ్ కు వలసవచ్చి వడియరాజులతో సాన్నిహిత్యం పెంచుకొని, కాలానుగుణంగా వీరిద్దరి కలయిక వడియరులుగా మారి కాలక్రమేణా వాడుకభాషలో వడ్డెరలుగా పిలవబడ్డారు. 12 వ శతాబ్దంలోని పరిపాలించిన చోళరాజులు వడియరాజులుగా చరిత్రకారులు చెపుతున్నారు. చోళరాజులలో అత్యంత ప్రముఖులు రాజరాజనరేంద్రుడు, ఈయన కాలంలో వీరిపాలన ఎంతో ద్విగుణికృతమైనదని చరిత్ర ద్వారా మనకు తెలిసిందే. కర్ణాటక ప్రాంతం నుండి వచ్చిన బోయర్లు మహారాజుల పాలనలో రక్షణ సిబ్బందిలో వుండి రాజ్యాంగ రక్షణతో మమేక్యమైయ్యారు. అలాగే వడియరాజులుగా పిలవబడి పరిపాలకులుగా వుండి ప్రజలకు మంచి పాలన అందించి ఎంతో మంచి పేరుతేచుకున్నారు. నెల్లూరు సీమను పరిపాలించిన రాజులు (రెండవ కరికాల చోలుడి నుండి నల్లసిధ్ది వరకు) సైతం వడియరాజులేనని చరిత్రకారులు చెపుతున్నారు. వీరి వీరిపాలనసమయం లో ప్రజలకు సుపరిపాలన అందించి అభివృద్దికి బాటలు వేసారు. చారిత్రిక కట్టడాలు, పలు దేవాలయాలు నిర్మించి అందరికి ఆదర్శంగా నిలిచారు. రాచరికం అంతరించిన అనంతరం వీరు అటుపిమ్మట వచ్చిన రాజులకు పటిష్టమైన రక్షణవ్యవస్తలో కీలకభాగాస్వాములైనారు. అంతేకాకుండా వీరు కోటలు నిర్మించడంలోను, కందకాలు నిర్మించడంలోను అందెవేసిన చెయ్యి అవడంతో అప్పట్లో కోటలు కట్టడంలో వీరినే ఎక్కువగా ఉపయోగించుకొనేవారు. ఎంతో వైసిష్ట్యంగల వడియరాజుల కాలం అంతరించిన అనంతరం కాలక్రమేణా నిలువ నీడలేని స్థితికి చేరుకున్నారు. అత్యంత బలిష్టులుగా ఎలాంటి పనినైన సునాయాసంగా నిర్వహించగలిగేవీరు అత్యంత కష్టమైన పనులకు చేరువయ్యారు. అత్యంత ప్రమాదకరమైన కొండలను సైతం పిండి చేయగల ధైర్యసాహసాలు, తెగువ వున్న వీరు కొండరాళ్ళను పగులగొట్టి కంకరరాళ్ళుగా మలచడంలో వీరి నైపుణ్యం గొప్పది. మట్టి పనికిగాని, కాలువల నిర్మాణమునకు గాని, వీరు లేనిదే అడుగు కూడా ముందుకు కదలలేని స్తితిలోవుందంటే వారి ప్రాముఖ్యత ఎంతవుందో ఇట్టే అర్ధమైపోతుంది. ఇంత కష్టపడి పనిచేసినను వారికి పొయ్యిలో పిల్లి కదిలేదికాదు. ప్రతీపూటా పస్తులతో రోజంతా గడిచేది. కాలేకడుపు నింపుకోవడానికి కుటుంబమంతా పొట్ట చేతపట్టుకొని పనికోసం సుదూరప్రాంతాలకు వలసలు వెళ్ళేవారు. ఆనాటి సమాజంలో తగిన గౌరవం లేకపోవటంతో వీరితో పనిచేయించుకున్న పెద్దలు పనులు పూర్తయ్యాక ముందుగా అనుకున్న మేర పూర్తిగా పైకం ఇవ్వకుండా వీరినే నానా దుర్భాషలాడి గెంటేసిన సంఘటనలు కాలగర్భంలో కోకొల్లలు. కారణం వీరి నిరక్షరాశ్యత బ్రతుకుతెరువుకోసం అనేక ప్రాంతాలకు వలసవెళ్ళే వీరు తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే అవకాశం లేకపోవటమే. దాంతో సమాజంలో వీరి ఎదుగుదలకు పెద్ద అవరోధంగా ఏర్పడింది. అనేక చారిత్రిక కట్టడాలు నిర్మించిన అనుభవంతో కాలానుగుణంగా వచ్చిన మార్పులతో భవన నిర్మాణరంగంలో కాలిడి భవన నిర్మాణ కార్మికులుగా స్థిరపడ్డారు. ఈ రంగంలో పట్టు సాధించి పలు అంతస్తుల భవనాలు నిర్మించటంలో రాటుదేలారు. భవన నిర్మాణ కార్యక్రమాలు తమ గ్రామాలలో లేకపోవడంతో నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడటంలో తమ పిల్లల విద్యాభివృద్దికి మరలా ఆటంకము ఏర్పడినది.

దాంతోపాటు నగరాలలో జీవనస్తితిగతులకు తగ్గట్టుగా ఇంటిల్లపాది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. దాంతో తమ పిల్లల విద్యకు స్వస్తిపలికి వారినికుడా బాల కార్మికులుగా పనిలోకి తీసుకు వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. నగరాలలో పలు అంతస్తుల భవనాల నిర్మాణం పెరగడంతో పనులుగూడా పెరిగాయి. కాని ఎతైన భవన నిర్మాణసమయంలో భవన యజమానులు తగిన ప్రామాణికాలు తీసుకోకపోవడంతో జరిగే ప్రమాణాలతో మరణించిన కార్మికులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఏవో కుంటిసాకులు చూపించి చేతులు దులుపుకుంటున్న యజమానులు కోకొల్లలు. ఫలితంగా నష్టపోయేది వడ్దేరలే, భవన నిర్మాణ రంగంలో పట్టుసాధించి పలు అంతస్తుల భవనాలు నిర్మిస్తూ ఆర్దికంగా పుంజుకున్నారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం కాలుమోపి సామాజికంగా గుర్తింపు తేచుకోవడంతో గతంలో వడ్దేరలను కరివేపాకులా తీసిపారేసిన పలు రాజకీయపార్టీలు వడియరాజుల కుల సాన్నిహిత్యం కోసం పెంపర్లాడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో పలువురు వార్డు మేమ్బెర్లుగాను,సర్పంచులుగాను ,వర్దేన్లుగాను, ఏం.పి.పి.లుగాను ఎన్నికైనారు. అక్షరజ్ఞానం అంతంత మాత్రం వుండటంతో పెత్తనం పరాయివారికి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడి, కేవలం కుర్చీలకు మాత్రమె పరిమితము అయ్యారు..
vtec player